ఎన్టీఆర్ అభిమానులకు గూస్ బంప్స్ తెచ్చే న్యూస్!

Thursday, February 13th, 2020, 09:57:09 AM IST

ఆర్ ఆర్ ఆర్ చిత్రం గురించి ఈ చిన్న సమాచారం బయటికి వచ్చినా అది సంచలనంగా మారిపోతుంది. దానికి కారణాలు కూడా లేకపోలేదు. బాహుబలి లాంటి చారిత్రాత్మక హిట్ సినిమాని తెరకెక్కించిన రాజమౌళి ఈ పీరియాడిక్ డ్రామాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే బాహుబలి 2 చిత్రం తో ప్రపంచవ్యాప్తం గా అభిమానులని సంపాదించుకున్న రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ చిత్రం తో మరొకసారి మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నాడు. అయితే ఇప్పటికే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ బాహుబలికి రెట్టింపు జరిగినట్లు తెలుస్తుంది.

అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ పులి తో ఫైట్ చేసే సన్నివేశం ఉన్నట్లు తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో లీక్ అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఈ చిత్రంలో నిజమైన పులిని వాడారని తెలుస్తుంది. కొమరం భీం పాత్రని తారాస్థాయిలో చూపించేందుకు రాజమౌళి నిజమైన పులి ని వాడారని, ఎన్టీఆర్ ఎంతో రిస్క్ చేసినట్లు తెలుస్తుంది. దాదాపు పది నిముషాలు ఉండే ఈ సన్నివేశానికి రాజమౌళి ఇంతటి సాహసం చేయడం, థియేటర్ లో మాత్రం ఈ సన్నివేశానికి గూస్ బంప్స్ పక్కా అని సినీ విశ్లేషకుల అభిప్రాయం.