పవన్ అభిమానికి షాక్.. ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు జరిమానా..!

Thursday, September 3rd, 2020, 08:30:06 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును నిన్న అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. అయితే చిత్తూరు జిల్లాలో ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు మృతి చెందిన ఘటనపై పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఒక్క సంఘటన తప్పా మిగతా అన్ని చోట్ల పవన్ బర్త్‌డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

అయితే పవన్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వ్యక్తికి జీహెచ్‌ఎంసీ షాక్ ఇచ్చింది. వీఎస్‌టీ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఫోటోను ఓ నెటిజన్‌ సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ప్లెక్సీ ఏర్పాటు చేసిన నరేందర్ కుమార్ అనే వ్యక్తికి 5 వేల జరిమానా విధిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నోటీసులు పంపారు.