సాటిలైట్ లో శాతకర్ణి సంచలనం ?

Saturday, August 13th, 2016, 08:34:30 AM IST

gautamiputrasatakarini
నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. బాలయ్య వందో సినిమా కావడంతో అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మూడు షెడ్యూల్ లు పూర్తీ చేసుకున్న ఈ సినిమా మరో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే బిజినెస్ పరంగా భారీ సంచలనం క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు మరో విషయంలో అంతే భారీ హైప్ ని క్రియేట్ చేసింది. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా సాటిలైట్ హక్కులు ఏకంగా 9. 50 కోట్లకు అమ్ముడు పోయాయట!! పవన్, మహేష్ లాంటి స్టార్ హీరోలకు ధీటుగా బాలయ్య సినిమా సాటిలైట్ హక్కులు అమ్ముడు పోవడం సంచలనం కలిగిస్తుంది. ఓ పాపులర్ ఛానల్ ఈ హక్కులను తీసుకుందట. ఈ చిత్రాన్ని త్వరలోనే షూటింగ్ పూర్తీ చేసి జనవరిలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటిస్తుంది.