బిగ్‌బాస్: గంగవ్వ ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నట్టేనా?

Friday, September 18th, 2020, 11:40:23 AM IST

Gangavva

బిగ్‌బాస్ సీజన్ 4 లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉన్న గంగవ్వ ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లోకి గంగవ్వ అడుగుపెట్టినప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవ్వగారే అని అందరూ అనుకున్నారు. అయితే ఈ సీజన్ మొదలై రెండు వారాలు కూడా కాలేదు అప్పుడే గంగవ్వ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని బలంగా కోరుకుంటుంది.

అయితే నాకు ఇక్కడ పడతలేదు, నాతో ఐతలేదు అంటూ గంగవ్వ నిన్న కన్నీరు పెట్టుకుంది. జ్వరంతో ఇబ్బంది పడుతున్న గంగవ్వను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మీ ఆరోగ్యానికి ఏమీ ఇబ్బంది లేదని, మీరు చాలా స్ట్రాంగ్ అని సముదాయించే ప్రయత్నం చేశాడు. మీ ఆరోగ్యాన్ని డాక్టర్ వచ్చి పరీక్షిస్తారని బిగ్‌బాస్ గంగవ్వకు చెప్పాడు. అయితే డాక్టర్ చూసిన తరువాత కూడా గంగవ్వ నేను ఉండలేను వెళ్ళిపోతాను అంటూ కోరుకుంది. అయితే గంగవ్వ కన్నీరు పెట్టుకోవడం చూసి ప్రేక్షకులు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు.

ఏదేమైనా పొద్దున లేచినప్పట్టి నుంచి, పొద్దుమేర పడుకునే దాకా బయట నలుగురిలో కలిసి, కలగలిపి మాట్లాడే గంగవ్వను మట్టి, ఎండ అనేదే కనిపించని ఏసీ గదుల్లో నాలుగు గోడల మధ్య బందీలా మార్చేసరికి ఆమె ప్రాణం తట్టుకోలేకపోతుంది. ఇదిలా ఉంటే గంగవ్వ ఏడుపును కూడా బిగ్ బాస్ క్యాష్ చేసుకుంటున్నాడేమో అన్న విమర్శలు కూడా మొదలవుతునాయి. గంగవ్వను ఎలిమినేట్ చేయడానికి మరో కారణం లేక ఆమె ఏడుపును అడ్డుగా చూపి హౌస్ నుంచి బయటకు పంపాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఏది ఎలా ఉన్నా ఈ వారం మాత్రం గంగవ్వ ఎలిమినేట్ అవ్వడం పక్కా అని అనిపిస్తుంది. అయితే గంగవ్వ మనసు మార్చుకుని హౌస్‌లో ఉంటుందా లేదా వెళ్ళిపోతుందా అనేది చూడాలి మరీ.