అలవైకుంఠపురంలో కనిపించే ఇల్లు ఎక్కడుందో తెలుసా..!

Wednesday, January 15th, 2020, 08:20:30 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూల్ చేస్తూ బన్నీ ఎవర్‌గ్రీన్ సినిమాలలో ఒకటిగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని చిత్ర యూనిట్ బయటపెట్టింది.

అయితే అలవైకుంఠపురంలో కనిపించే ఇల్లు ఎక్కడో సెట్ వేసింది కాదని అది నిజమైన ఇల్లు అని తెలిపింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఈ ఇళ్ళు విలువ దాదాపు 300 కోట్లకు పైగా ఉంటుంది. అంతేకాదు ఎంతో అందంగా, విశాలంగా కనిపించే ఈ ఇంట్లో పూసే పూలకు కూడా పేటెంట్ ఉంటుంది. ఎంతో విలువైన ఇటలీ మొక్కలు కూడా ఈ ఇంట్లోనే ఉన్నాయి. అయితే ఈ ఇంటిని ఒకసారి త్రివిక్రమ్ చూసి తన కథకు సరైన ఇళ్ళు అని అనుకుని ఆ ఇంటి యజమానిని షూటింగ్ కోసం అడిగాడు. అయితే త్రివిక్రమ్ అడగడంతో కాదనలేకపోయిన వారు 20 రోజుల పాటు ఆ ఇంటిని షూటింగ్ కోసం ఇచ్చారు. ఆ ఇల్లు NTV న్యూస్ ఛానెల్ అధినేత నరేంద్ర చౌదరి ఏకైక కూతరు రచన గారిదట.