భారీ హిట్ “కేజీయఫ్”కు దగ్గరగా రాబట్టేసిన ప్లాప్ “ఐ”.!

Thursday, August 6th, 2020, 01:47:17 PM IST

Vikram_I_movie

మన దగ్గర కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన “కేజీయఫ్ చాప్టర్ 1” ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. ఒక్క కన్నడ తెలుగులో మాత్రమే కాకుండా మొత్తం మన ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. కానీ ఇంత పెద్ద హిట్ కాబడిన ఈ చిత్రం మొట్ట మొదటి సారిగా తెలుగులో టెలికాస్ట్ చెయ్యగా కేవలం 11.9 టీఆర్పీ రేటింగ్ రాబట్టగా..

దీనికి మించిన డబుల్ హైప్ తో వచ్చి భారీ ప్లాప్ గా నిలిచినా “ఐ” సినిమాకు కూడా దగ్గర దగ్గరగా అంటే రేటింగ్ ను రాబట్టేసింది. గత ఆదివారం కాక అంతకు ముందు ఆదివారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్లో ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేసారు. ఇండియన్ జేమ్స్ కామెరూన్ శంకర్ మరియు చియాన్ విక్రమ్ ల కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఐదేళ్ల కితం భారీ అంచనాల నడుమ విడుదలయ్యింది.

కానీ అప్పటి ఒక్కసారి కూడా టెలికాస్ట్ అయ్యింది లేదు. కానీ గత కొన్ని రోజుల కితమే అంటే ఐదేళ్ల తర్వాతే స్టార్ మా ఛానెల్లో టెలికాస్ట్ కాగా ఈ చిత్రానికి 11.13 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అంటే ఎంతో పెద్ద హిట్టయిన “కేజీయఫ్” నెలకొల్పిన రికార్డు దగ్గరకు ఈ ప్లాప్ చిత్రం వచ్చేసినట్టే అని చెప్పాలి. అలాగే దీనితో పాటు అదే స్టార్ మా లో టెలికాస్ట్ అయిన హాలీవుడ్ చిత్రం “ది లయన్ కింగ్” 7.7 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టింది.