యాంకర్ ప్రదీప్ ఖాతాలో మరో రికార్డ్.. రిలీజ్‌కి ముందే..!

Sunday, August 16th, 2020, 03:20:17 PM IST

anchor pradeep

తెలుగు బుల్లి తెర యాంకర్‌గా టాప్‌లో కొనసాగుతున్న యాంకర్ ప్రదీప్ తన ఖాతాలో మరో రికార్డ్ నమోదు చేసుకున్నాడు. ఓ పక్క యాంకరింగ్ చేస్తూనే తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకుల ముందు కనిపించిన ప్రదీప్ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు.

అయితే కరోనా కారణంగా ఈ సినిమా ఇంకా ధియేటర్లలో రిలీజ్ కాకపోయినా ఈ సినిమా ద్వారానే ప్రదీప్ ఓ ఆల్‌టైం రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రదీప్ నటించిన ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం సాంగ్ యూట్యూబ్‌లో ఏక్మగా 200 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. సౌతిండియాలో ఏ హీరో సాధించలేని రికార్డును హీరోగా తొలి సినిమా రిలీజ్ కాకముందే ప్రదీప్ సొంతం చేసుకోవడం విశేషం.