హాట్ టాపిక్: అభిమానులకు “ఐ ఫీస్ట్” సిద్దం చేస్తున్న రాజమౌళి!?

Sunday, August 2nd, 2020, 11:01:42 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధీరమ్ చిత్రం లో మొట్ట మొదటి సారిగా ఇద్దరు స్టార్ హీరో లు కలిసి నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు. అయితే ఈ పాత్రల కోసం రాజమౌళి ఎంతో శ్రమిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా రాజమౌళి నుండి ఈ చిత్రానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ లేదు. చివరగా భీం ఫర్ రామరాజు మాత్రమే విడుదల అయింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఆగస్ట్ 15 న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా మేకింగ్ వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మేకింగ్ వీడియో లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ టీజర్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 8 న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.