ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : “ఎంత మంచివాడవురా”

Wednesday, January 15th, 2020, 09:09:11 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో అత్యవసరంగా హిట్ అందుకోవాల్సిన హీరోల్లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు.అయితే ఈ సంక్రాంతికి విడుదల కాబడిన ప్రతీ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో సరిగా సంక్రాంతి రోజునే తన చిత్రం “ఎంత మంచివాడవురా”తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.2017 సంక్రాంతికి “శతమానం భవతి” చిత్రంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది.

సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి పర్వాలేదని చెప్పొచ్చు.ముఖ్యంగా ఈ చిత్రం తాలుకా కాన్సెప్ట్ కాస్త విచిత్రంగా అనిపిస్తుంది.దానిని కళ్యాణ్ రామ్ చక్కగా పోషించారు.అంతే కాకుండా ఆ కాన్సెప్ట్ తో వచ్చే ఎమోషన్స్ ను దర్శకుడు సతీష్ వేగేశ్న బాగా హ్యాండిల్ చేసారు.అలాగే కథనంలో చోటు చేసుకున్నటువంటి ట్విస్టులు కానీ మెప్పిస్తాయి.అయితే అద్భుతమైన పాయింట్ ను ఇప్పటివరకు దర్శకుడు మంచి ఎమోషన్స్ తో నడిపించారు కానీ అక్కడక్కడా నెమ్మదించారు.మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.