ప్రభాస్ 20కు ఇండియన్ హిస్టరీలోనే సరికొత్త టెక్నాలజీ.!

Thursday, February 13th, 2020, 08:41:20 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు తన పాన్ ఇండియన్ స్టార్డం ను కాపాడుకోడానికి తాను ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో ఏమో కానీ దానిని మైంటైన్ చెయ్యడానికి తన దర్శకులు మాత్రం గట్టిగానే కష్టపడుతున్నారు.అలా బాహుబలి తర్వాత సుజీత్ ప్రభాస్ ను “సాహో” ద్వారా ఒక రేంజ్ లో ఎలివేట్ చేసాడు.

కనీ వినీ ఎరుగని యాక్షన్ ఎపిసోడ్స్ తో సరికొత్త టెక్నాలజీలతో దేశ వ్యాప్తంగా ప్రభాస్ పేరును ఈ చిత్రం అలా వ్యాప్తి చేస్తూనే ఉంది.ఇప్పుడు అదే బాటలో ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రం “ఓ డియర్”ను జిల్ ఫేమ్ రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నారు.అయితే ఈ చిత్రానికి ఇండియన్ హిస్టరీలోనే ఏ చిత్రానికీ వినియోగించని ఓ సరికొత్త టెక్నాలజీను వినియోగిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ సరికొత్త టెక్నాలజీను “వర్చ్యువల్ ప్రొడక్షన్” అని అంటున్నారు.ఈ టెక్నాలజీ ద్వారా నిజంగా కనిపించే వస్తువులతో పాటుగా డిజిటల్ గా తయారు చేసిన విజువల్స్ ఏక కాలంలో కలిస్తే ఎలా ఉంటుందో ఈ టెక్నాలజీ తాలూకా ఆంతర్యం అని తెలుస్తుంది.అయితే మాటల్లో కాస్త అర్ధం కాకపోయినా థియేటర్ లో ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.