ప్రభాస్ ఆదిపురుష్ సెట్ లో అగ్నప్రమాదం

Wednesday, February 3rd, 2021, 10:04:34 AM IST

ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్ సినిమా షూటింగ్ మంగళవారం నాడు ప్రారంభం అయింది. అయితే సినిమా సెట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటిరోజే సినిమా సెట్ లో మంటలు చెలరేగాయి. అయితే చిత్ర యూనిట్ అప్రమత్తం కావడం తో చాలావరకు తక్కువ నష్టం జరిగింది. అయితే ప్రభాస్ నటిస్తున్న చిత్రం తొలిరోజే ఇలా ప్రమాదం జరగడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. సైఫ్ అలీఖాన్ రావణాసురుడు పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం 3డీ లో తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా, కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో చిత్రం ను విడుదల చేయనున్నారు. పౌరాణిక రామాయణం ఆధారంగా ఈ చిత్రం ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం లో బాహుబలి తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ నటిస్తుండటం తో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ విడుదల కి సిద్దం అవుతోంది. మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్.