జల్లికట్టు ను అందుకే ఎంపిక చేశాం

Thursday, November 26th, 2020, 08:45:08 AM IST

ఆస్కార్ అవార్డు కోసం భారత్ తరపున చిత్రాలు వెళ్తున్న చివరి వరకు కూడా బరిలో నిలబడలేక పోతున్నాయి. అయితే ఈ గత ఏడాది రణ్వీర్ సింగ్ నటించిన చిత్రం గల్లీ భాయ్ భారత్ తరపున ఆస్కార్ కి వెళ్ళింది. అయితే ఈ చిత్రం ఫైనల్ లిస్ట్ లోకి కూడా చేరుకోలేక పోయింది. అయితే ఈ ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమ నుండి లిజో జోసి పెల్లిస్సెరి దర్శకత్వం వహించిన జల్లికట్టు చిత్రం 93 వ ఆస్కార్ అవార్డ్ ల పోటీకి భారత్ నుండి వెళ్లనుంది. ఉత్తమ చిత్రాలు పోటీలో ఈ చిత్రం నిలవనుంది.

అయితే శకుంతలా దేవీ, గుంజన్ సక్సేనా, చపాక్, గులాబో సితాబో, చెక్ పోస్ట్, స్కై ఇజ్ పింక్ వంటి 27 చిత్రాలను పరిశీలించిన అనంతరం జల్లికట్టు చిత్రం ను ఎంపిక చేశాం అని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ బోర్డ్ చైర్మన్ రాహుల్ రావైల్ తెలిపారు. కథా నేపద్యం, నిర్మాణ విలువలు, దర్శకుడు ప్రతిభ ఆధారంగా ఈ చిత్రాన్ని ఎంపిక చేసినట్లు వివరించారు. చివరగా 2002 లో అమీర్ ఖాన్ నటించిన లగాన్ చిత్రం ఆస్కార్ తుది జాబితా లో ఉండగా ఇప్పటి వరకు ఏ చిత్రం కూడా వెళ్లలేకపోయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 25 న ఈ ఆస్కార్ అవార్డ్ వేడుక ను నిర్వహించనున్నారు.