రామ్ చరణ్ పుట్టిన రోజుకోసం ఎదురు చూస్తున్న అభిమానులు!

Sunday, March 21st, 2021, 08:02:39 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుదిరం చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నారు. అయితే రామ్ చరణ్ కి సంబంధించిన ఒక అప్డేట్ ను ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే మార్చి 27 వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు అని అందరికీ తెలిసిందే. అయితే రామ్ చరణ్ కి సంబంధించిన పలు అప్డేట్స్ కొరకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఒక పక్క సోషల్ మీడియా లో ట్రెండ్ తో పాటుగా మరి కొన్ని చోట్ల సంబరాల కొరకు ప్లాన్స్ షురూ చేశారు. రామ్ చరణ్ ఆచార్య లో సిద్ద పాత్రలో నటిస్తున్నారు. అయితే దీనితో పాటుగా శంకర్ దర్శకత్వం లో మరొక సినిమా చేస్తున్నారు. అయితే దీనికి ఇంకా టైటిల్ ప్రకటించలేదు. అయితే దీని పై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వీటన్నిటికీ కూడా రామ్ చరణ్ పుట్టిన రోజు న ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాక రామ్ చరణ్ కి సంబంధించిన కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఏవైనా ఉన్నాయా లేవా అని తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే.