“RRR” లో ఎన్టీఆర్ రోల్ రచ్చ రచ్చేనట.!

Wednesday, August 5th, 2020, 08:58:33 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి వస్తున్న సిసలైన భారీ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ డ్రామాపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సరే అది ఊహించని రేంజ్ లో అనిపిస్తుంది. ఈ చిత్రంలో అల్లూరిగా రామ్ చరణ్ ఎలా ఉంటారో రాజమౌళి చూపించేశారు. ఇక మిగిలింది కొమరం భీమ్ గా తారక్ మాత్రమే. ఇప్పుడు ఇదే రోల్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలే వినిపిస్తున్నాయి.

యంగ్ టైగర్ కొమరం భీమ్ గా మొత్తం 6 భిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నారని, పూర్తిగా డిఫరెంట్ గా కనిపించే తారక్ లుక్స్ ఓ రేంజ్ లో ఉండనున్నాయి అన్నట్టు తెలుస్తుంది. దీనితో తారక్ అభిమానులకు మాత్రం పూనకాలే అన్నట్లు టాక్. ఇప్పటికే ఎలాంటి ఫస్ట్ లుక్ టీజర్ లేక తారక్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. మరి జక్కన్న ఏం చేస్తారో చూడాలి.