ఈ ఫీల్ గుడ్ సినిమా హక్కులను సొంతం చేసుకున్న ఈటీవీ..!

Tuesday, August 4th, 2020, 03:16:24 PM IST

Uma Maheswara Ugra Roopasya

మన టాలీవుడ్లో మోస్ట్ టాలెంటెడ్ అండ్ అండర్ రేటెడ్ హీరోలలో సత్యదేవ్ కూడా ఒకరు. ఇప్పటికే తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ హీరో నటించిన తాజా చిత్రం “ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య” డిజిటల్ గా విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుంది. నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ఈ చిత్రం ఒక స్లో పాయిజన్ లా ప్రతీ ఒక్కరికీ ఎక్కుతుంది.

అయితే ఈ అద్భుతమైన చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను తెలుగు టాప్ ఛానెల్స్ లో ఒకటైన ఈటీవీ వారు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. మాములుగా ఈటీవీ వారు కొత్త సినిమాలను తీసుకోవడం అనేదే చాలా అరుదు. అలా అని వీరు తీసుకునే సినిమాలు మాములుగా కూడా ఉండవు. ఈ సినిమా అలాంటి ఛానెల్లో రావడం అనేది కూడా మరింత పాజిటివ్ ఫీల్ ను తీసుకొస్తుంది. మరి ఈ చిత్రం ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారో చూడాలి.