ఈటీవీ 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ అదిరిపోవడం ఖాయం..!

Wednesday, August 26th, 2020, 02:40:56 PM IST

ETV_25years

టీవీ రంగంలో గత 25 ఏళ్ళుగా దూసుకుపోతూ ఎవర్ గ్రీన్ నంబర్ వన్ ఛానల్‌గా తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన ఏకైక ఛానల్ ఈటీవీ. అయితే ఈటీవీ 25 వసంతాలు పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా మల్లెమాల వారు ఓ సరికొత్త ప్రోగ్రాంని ప్లాన్ చేశారు. “ఈటీవీ 25 ఇయర్స్ వేడుక మాది – విజయం మీది” అనే టైటిల్‌తో మనందరిని అలరింపచేసేందుకు సిద్దమైపోయారు.

అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రోజా శేఖర్ మాస్టర్‌పై పంచ్‌లు వేయడం, మంచు లక్ష్మీ ఎంట్రీ ఇవ్వడం, అనసూయ డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేయడం ఇవన్ని ఒక ఎత్తు అయితే మెగస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లు ఈటీవీకి శుభాకాంక్షలు చెప్పడం చూస్తుంటే ఈ వేడుక దుమ్ము దులేపేయడం ఖాయమనిపిస్తుంది. మరీ ఈ కార్యక్రమాన్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం ఆగష్ట్ 30వ తేది ఈ ఆదివారం ఉదయం 9 గంటలకు ఈటీవీనీ తప్పక చూడండి, మీ తరుపున శుభాకాంక్షలు తెలపండి.