“దిశ ఎన్‌కౌంటర్” ట్రైలర్ రిలీజ్..!

Saturday, September 26th, 2020, 02:00:53 PM IST

వివాదస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గత ఏడాది తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన దిశ హత్య కేసుపై సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మూవీకి సంబంధించి ఇదివరకే ఫ‌స్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసిన వర్మ తాజాగా ఆ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశాడు.

అయితే దిశా ఘటనను యదార్థంగా ఈ సినిమాలో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఓ అమ్మాయి తన స్కూటీనీ హైవే పక్కన పార్క్ చేయడం, అది నలుగురు లారీ యువకులు చూడడం, బైక్ పంచర్ చేయడం, ఆ అమ్మాయిని నమ్మించి ఎత్తుకెళ్ళి హత్యాచారం చేయడం, తర్వాత శవాన్ని లారీలో ఎక్కించుకుని ఓ బ్రిడ్జ్ కిందకు వెళ్ళి శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టడం వంటి సన్నివేశాలను ట్రైలర్‌లో చూపించాడు. అంతేకాదు చివరలో ఆ నలుగురుని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్టు బ్యాక్‌గ్రౌండ్ ద్వారా వినిపించాడు. అయితే ఈ సినిమాను నవంబర్ 26 న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.