దిశ ఎన్‌కౌంటర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

Saturday, September 5th, 2020, 11:17:09 AM IST

వివాదస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గత ఏడాది తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన దిశ హత్య కేసుపై సినిమాను చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను వర్మ తాజాగా రిలీజ్ చేశాడు. ఒక స్కూటీ స్టాండ్ వేసి ఉండగా, లారీ మరియు నిందితులు పారిపోతుంటే ఎన్‌కౌంటర్ చేస్తున్నట్టు అందులో చూపించారు.

అయితే 2019 నవంబ‌ర్ 26న శంషాబాద్ సమీపంలో లారీనీ నడిపే నలుగురు యువకులు ఒక యువతిపై అత్యాచారం చేసి కాల్చి చంపేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఆ తరువాత నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. దిశా హ‌త్య నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో సామూహిక అత్యాచారం, హ‌త్య, కాల్చి చంప‌డం వంటి అంశాలను చూపించబోతున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 26 న ఈ సినిమా టీజర్, నవంబర్ 26 న సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.