ఆ కుర్ర హీరోకు చౌదరి హిట్ ఇస్తాడా..?

Wednesday, November 4th, 2015, 12:29:37 PM IST

yvs-chowdary
శ్రీ సీతారాముల కళ్యాణ్ చూతము రారండి.. లాహిరి లాహిరి లాహిరిలో.. దేవదాసు వంటి వైవిధ్య భరితమైన చిత్రాలు తీసి.. వెంకట్, ఆదిత్య ఓం, రామ్ వంటి హీరోలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి వైవిఎస్ చౌదరి. హీరోలను ఇంట్రడ్యూస్ చేయడంలో, హీరోలకు మంచి బ్రేక్ ఇవ్వడంలో చౌదరిది అందే వేసిన చెయ్యి అనడంలో సందేహం లేదు. ఇంతవరకు బాగానే ఉన్నది. కాని, మెగాకాంపౌండ్ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ తీసిన రేయ్ చిత్రం మాత్రం డిజాస్టర్ అయింది. డాన్సు బ్యాక్ డ్రాప్ తో వచ్చిన రేయ్ ని భారీగా తీశాడు. ఎంత భారీగా తీసిన సినిమా మాత్రం ఫ్లాప్ అయింది.

ఇకపోతే, వైవిఎస్ చౌదరి తన పాత ఫార్ములానే నమ్ముకొని.. నేడే ఈనాడే.. కరుణించే నను చెలికాడే అనే టైటిల్ ఓ కథను అలాగే, ఒక లోకల్ ప్రేమ కథ అనే టైటిల్ తో మరో ప్రేమ కథను రెడీ చేసుకున్నాడట. ఉయ్యాల జంపాల అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన రాజ్ తరుణ్ హీరోగా చౌదరి సినిమా చేయబోతున్నాడట. మరి చౌదరి ఆ కుర్ర హీరోకు హిట్ ఇస్తాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు పడుతుంది.