“సై రా” దర్శకుడి తో అఖిల్ సినిమా?

Friday, August 14th, 2020, 12:15:45 AM IST

అఖిల్ తెలుగు చిత్ర పరిశ్రమలో కి అడుగుపెట్టి నప్పటి నుండి చెప్పుకోడానికి ఒక్క హిట్ కూడా లేదు. మిస్టర్ మజ్ను ఓకే అని అనిపించుకున్న అక్కినేని వారసుడిగా అఖిల్ అందుకు తగ్గట్టు గా రాణించడం లేదు అని చెప్పాలి. రూటు మార్చి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ ఒక చిత్రం లో నటిస్తున్నారు అఖిల్. అయితే ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. అయితే ఇపుడు స్టోరీ విషయం లో కాస్త ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

సై రా నరసింహ రెడ్డి తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి మరో ప్రాజెక్ట్ ను చేపట్ట లేదు. ఈ స్టార్ స్టేటస్ ఉన్న దర్శకుడు మరో స్టార్ హీరో కోసం ఆలోచించ కుండా అక్కినేని అఖిల్ కి ఒక కథ చెప్పారట. అయితే అఖిల్ కి స్టోరీ తెగ నచ్చేసింది అని తెలుస్తోంది. కథ విన్న వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఎన్నో కమర్షియల్ హిట్స్ అందించిన సురేందర్ రెడ్డి, అఖిల్ కి కూడా హిట్ ఇచ్చే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. మరి అఖిల్ అభిమానులకు సురేందర్ రెడ్డి ఆ కిక్ ఇస్తాడే లేదో చూడాలి మరి.