స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను మర్చిపోవచ్చు – సుకుమార్

Wednesday, March 10th, 2021, 09:30:23 AM IST

తెలుగు సినీ పరిశ్రమ లో తన సినిమాలతో కొత్త రకం ప్రయోగాలు చేసిన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా ఎదిగారు. అయితే పుష్ప లాంటి ఊర మాస్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు అల్లు అర్జున్. అయితే తాజాగా పుష్ప చిత్రం లోని అల్లు అర్జున్ లుక్ పై దర్శకుడు సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్కటి మాత్రం నిజం, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను మీరు మర్చిపోవచ్చు అని అన్నారు. ఒక కొత్త ఐకానిక్ మాస్ స్టార్ గా తయారవుతారు అని,ఇంకొక కొత్త వెర్షన్ చూస్తారు అంటూ చెప్పుకొచ్చారు. సుకుమార్ రంగస్థలం చిత్రం తో రామ్ చరణ్ ను సైతం కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో ప్రజెంట్ చేసి మంచి మార్కులే కొట్టేశాడు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లుక్ పుష్ప లో డిఫరెంట్ గా ఉన్న సంగతి విడుదల అయిన పోస్టర్లు ను చూస్తేనే తెలుస్తుంది. అయితే సుకుమార్ చేసిన వ్యాఖ్యలు సైతం అభిమానులకు సినిమా పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

అలా వైకుంఠ పురం లో చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ మరొకసారి భారీ హిట్ కొట్టేందుకు పుష్ప చిత్రం తో బాక్సాఫీస్ పై ఆగస్ట్ 13 న దాడి చేయనున్నాడు. అయితే ఈ చిత్రం పాన్ ఇండియన్ మూవీ గా విడుదల కానున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక మందాన్న నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.