సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపిన దర్శకధీరుడు రాజమౌళి..!

Friday, May 22nd, 2020, 09:32:30 PM IST

టాలీవుడ్ సినీ ప్రముఖులంతా నేడు ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసి సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. సినిమా షూటింగులకు, సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

అయితే వారి విజ్ణప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ తక్కువ మందితో, ఇండోర్‌లో చేసే వీలున్న రీ-ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అయితే ఇండస్ట్రీ ఎదురుకుంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని సానుకూలంగా స్పందించడంతో దర్శకధీరుడు రాజమౌళి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే సినీ రంగం తరుపున మేము చెప్పిన వాటన్నిటిని ఓపికగా విని సినిమా రంగాన్ని తిరిగి మామూలు పరిస్థితిలోకి తీసుకొచ్చేందుకు సానుకూలంగా స్పందిస్తూ, అనేక అవసరమైన జాగ్రత్తలను సీఎం కేసీఆర్ తెలిపాడని రాజమౌళి ట్వీట్ చేశారు.