రాజమౌళి ప్లాస్మా దానం చేయలేదు…ఎందుకంటే?

Tuesday, September 1st, 2020, 05:22:31 PM IST

SS-Rajamouli

కరోనా వైరస్ మహమ్మారి భారత్ లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ మహమ్మారి నుండి కోలుకొని బయట పడేందుకు ప్లాస్మా ఆయుధం లా పని చేస్తుంది. అయితే ఇటీవల కరోనా వైరస్ సోకిన దర్శకుడు రాజమౌళి ప్లాస్మా దానం చేయలేదు. అందుకు గల కారణాన్ని వివరించారు.తన శరీరం లో యాంటీ బాడీస్ కోసం పరీక్షలు చేయించు కోగా, ఐజిజి లెవెల్స
8.62 ఉన్నాయి అని అన్నారు.అయితే ప్లాస్మా దానం చేయాలి అంటే,15 కంటే ఎక్కువగా ఉండాలి అని తెలిపారు.

అయితే సంగీత దర్శకుడు కీరవాణి, భైరవ మంగళవారం నాడు ఉదయం ప్లాస్మా దానం చేశారు అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే కరోనా వైరస్ నుండి కోలుకున్న వారు వీలైనంత త్వరగా ప్లాస్మా దానం చేయాలి అని, ప్లాస్మా దానం చేసి ప్రాణాలను కాపాడాలి అని కోరారు. గత కొద్ది రోజుల క్రితం రాజమౌళి కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న సంగతి తెలిసిందే.