హాట్ టాపిక్: కేజీఎఫ్ రేంజ్ లో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా!?

Wednesday, August 12th, 2020, 01:07:07 AM IST

NTR_Prashanth_Neel
సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి గత కొద్ది సంవత్సరాల నుండి పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండానే భారీ విజయాన్ని దక్కించుకున్న కేజీ ఎఫ్ చిత్రం ఇపుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా వస్తుంది. అయితే ఈ చిత్ర దర్శకుడు తెలుగు లో ఒక చిత్రాన్ని డైరక్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో ఇప్పటికే ఎన్టీఆర్ కి ఒక కథ చెప్పినట్లు సమాచారం. అయితే ఈ కథ కి ఎన్టీఆర్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

అయితే ఈ చిత్రానికి సంబంధించి మరొకసారి ఎన్టీఆర్ తో దర్శకుడు చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా తరహాలో నిర్మించేందుకు సిద్దంగా ఉంది అని, ఈ బ్యానర్ ముందుకు రావడమే కాక, ఎన్టీఆర్ డేట్స్ ను కూడా ముందుగానే రిజర్వ్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ రౌద్రం రణం రుదీరం లో కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కే మరొక చిత్రం లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాల అనంతరం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ తరహాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.