కేజీఎఫ్ స్క్రిప్ట్ రాసే టైమ్ లోనే సలార్ కూడా..!

Friday, January 22nd, 2021, 08:35:11 AM IST

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సలార్ అంటూ మరొక క్రేజీ ప్రాజెక్ట్ లో నటించేందుకు సిద్దం అయ్యారు. ఈ చిత్రాన్ని కన్నడ చిత్ర పరిశ్రమ కి చెందిన దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు అదే పరిశ్రమ కి చెందిన విజయ్ కిరగందూర్ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని హొంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ చిత్రం అనౌన్స్ చేయగానే ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకూ ప్రభాస్ ను ఎవరు కూడా ఊహించని రీతిలో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడు.

అయితే సలార్ అంటూ టైటిల్ తో మాస్ లుక్ తో ప్రభాస్ ఉండటం తో మొదటి నుండి సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం రీమేక్ అంటూ పలు వార్తలు వస్తున్నాయి. దీని పై దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పందించారు. ఏ సినిమా కి సలార్ రీమేక్ కాదు అని, కేజీఎఫ్ స్క్రిప్ట్ రాసుకొనే సమయంలో నే సలార్ స్క్రిప్ట్ కూడా రాసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమా లో ప్రభాస్ అమాయకంగా ఉంటాడు అని, పరిస్థితుల కారణంగా వయోలెంట్ గా మారతాడు అంటూ చెప్పుకొచ్చారు. ప్రశాంత్ నీల్ చేసిన వ్యాఖ్యలు సినిమా పై మరింత ఆసక్తిని కలిగించే విధంగా ఉండటం తో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.