“ఆది పురుష్” చిత్రాన్ని ప్రభాస్ ఒప్పుకోక పోయి ఉంటే!?

Monday, August 24th, 2020, 05:24:34 PM IST

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో భారీ నుండి అతి భారీ చిత్రాలు వస్తున్నాయి. అయితే బాలీవుడ్ లో పలువురు అగ్ర హీరోలు ఉన్నప్పటికీ కూడా ఆది పురుష్ లాంటి పీరియాడిక్ డ్రామా కి దర్శక నిర్మాతలు ప్రభాస్ కి మొగ్గు చూపరు. ఇందుకు కారణం ఏమై ఉంటుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్నారు. బాహుబలి చిత్రం తో జక్కన్న తెలుగు సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరింప చేశారు. ఆ చరిశ్మా తోనే ప్రభాస్ సాహో చిత్రం కూడా వచ్చింది. బాలీవుడ్ లో ప్రభాస్ సత్తా ఏంటో మరొకసారి సా హొ చిత్రం తెలిపింది. అయితే ప్రభాస్ వరుసగా భారీ చిత్రాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆది పురుష్ చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ చిత్రం గురించి దర్శకుడు ఓం రౌత్ ఇలా అన్నారు.

ప్రభాస్ ఆది పురుష్ పాత్రకి సరిపోతాడు అని నాకు అనిపించింది. ప్రభాస్ పర్సనాలిటీ, ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండే తత్వం, లోతైన చూపు, నిలబడే విధానం, నడిచే తీరు, ఇలా ప్రభాస్ లో ఆది పురుష్ ను చూసాను, ఒకవేళ ప్రభాస్ కాకపోయి ఉంటే ఈ సినిమా చేసేవాణ్ణి కాదు అంటూ ఓం రౌత్ చెప్పుకొచ్చారు. ప్రభాస్ కోసమే దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా కొన్ని ఏళ్లు గా సినిమా కథ సిద్దం చేసినట్లు తెలిపారు. దర్శకుడు గా ఎదగడానికి ప్రభాస్ కారణం అని అపుడు నాగ్ అశ్విన్, ఇపుడు ఓం రౌత్ ఇలా చెప్పడం తో ప్రభాస్ అందరికీ ఫేవరెట్ అయ్యారు అని చెప్పాలి. అంతేకాక రెమ్యునరేషన్ లో కూడా ప్రభాస్ ఎంత అడిగినా ఇవ్వడానికి సిద్దంగా నిర్మాతలు పోటీ పడుతున్నారు.