హాట్ టాపిక్: పవన్ కోసం ఆగలేక క్రిష్ ఇలా చేస్తున్నారా?

Wednesday, July 8th, 2020, 01:45:55 AM IST


విభిన్న కథాంశాలతో దర్శకుడు కృష్ తెలుగు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నారు. అయితే ఒక భిన్న కథాంశం తో పవన్ వద్దకు వెళ్ళగా, అందుకు పవన్ సరే అన్నారు. అయితే ప్రస్తుతం విరూపాక్ష అనే టైటిల్ సైతం సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం అనంతరం క్రిష్ తో పని చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిత్ర షూటింగ్ వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే పవన్ ఒక దాని తర్వాత మరొక చిత్రం చేయాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే లోగా నిర్మాత గా మారేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే వెబ్ సిరీస్ లను నిర్మించే పనిలో ఉన్న క్రిష్, తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి తో సినిమా చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఒక స్టార్ హీరో తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో క్రిష్ ఒక సినిమా ను నిర్మించాలని భావిస్తున్నారు. అదే విధంగా తాజాగా కృష్ణ అండ్ హిస్ లీల చిత్రం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు రవికాంత్ తో సైతం క్రిష్ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరి దీని కి సంబంధించిన విషయాలను క్రిష్ అధికారికంగా ఎపుడు చూడాలి.