ముత్తయ్య మురళీధరన్ నమ్మక ద్రోహి…800 చిత్రం లో నటించొద్దు

Friday, October 16th, 2020, 08:28:08 AM IST

విలక్షణ నటుడు గా పేరు తెచ్చుకుంటున్న విజయ్ సేతుపతి 800 చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ అని తెలిసిందే. అయితే నమ్మక ద్రోహి జీవిత చరిత్ర తో తెరకెక్కుతున్న చిత్రం లో నటించవద్దు అంటూ విజయ సేతుపతి కి దరకుడు భారతీరాజా హితవు పలికారు. ఈ చిత్రానికి ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తుండగా, ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల అయింది. ముత్తయ్య మురళీధరన్ లాగానే విజయ్ సేతుపతి ఉన్నాడు అంటూ నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ చిత్రం కి సంబంధించి ముత్తయ్య మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తుండటం తో తమిళ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారతీ రాజా మాత్రం నటించవద్దు అని, అందులో ముత్తయ్య మురళీధరన్ మతవాదానికి పూర్తి మద్దతు తెలిపిన వ్యక్తి అని ఆరోపించారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు సైతం విజయ్ సేతుపతి కి ఇదే తరహాలో సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.