మొత్తానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది గా!

Monday, September 7th, 2020, 04:18:41 PM IST

RX 100 చిత్రం తో తెలుగు యువత ను ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ఎట్టకేలకు తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. తొలి చిత్రం తోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ దర్శకుడు తన నెక్స్ట్ చిత్రం కోసం చాలా సమయం తీసుకున్నారు. ఎట్టకేలకు తన మహ సముద్రం లో హీరో గా శర్వానంద్ ను తీసుకున్నారు. నటుడు గా శర్వానంద్ కి ఎంతో క్రేజ్, పాపులారిటీ ఉన్నప్పటికీ మంచి హిట్ మాత్రం దక్కడం లేదు. ఇటీవల రణరంగం మరియు జాను చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి.

అయితే అజయ్ భూపతి తో పని చేయడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లవ్ మరియు యాక్షన్ డ్రామా గా ఈ చిత్రం తెరకక్కబోతుంది. ఈ చిత్రాన్ని తెలుగు తో పాటుగా తమిళ్ లో సైతం విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ చిత్రాన్ని ఏ కే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శర్వానంద్ మరియు అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం లో తప్పక విజయం సాధిస్తామని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన మరొక బిగ్ అప్డేట్ ను అందించ నున్నట్లు తెలుస్తోంది.