కరోనా మాయ : చైనా పురాణాన్ని సరికొత్తగా చెప్పిన దర్శకుడు హరీష్ శంకర్…

Wednesday, March 25th, 2020, 10:16:25 AM IST

సామాజిక మాంద్యమాల్లో నిత్యం యాక్టీవ్ గా ఉండే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా మహమ్మారి కరోనా వైరస్ పై కూడా కొన్ని ఆసక్తికరమైన పోస్టు షేర్ చేశారు. ఈ భయానకమైన కరోనా వైరస్ ని నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలన్నీ కూడా ఎన్నో కఠినమైన చర్యలను తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ వైరస్ దారుణంగా వ్యాపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మరొక 21 రోజులు దేశం మొత్తాన్ని నిర్బంధంలో ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఇకపోతే ఈ కరోనా వైరస్ నివారణకై, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఒక ఆసక్తికరమైన పోస్టు షేర్ చేశారు.

కాగా తాజాగా “చైనా పురాణం” అనే ఆసక్తికర కథాంశంతో వచ్చే ఈ పోస్టు అందరికి తెగ నచ్చేసింది కూడా. అందుకనే ఈ పోస్టు ప్రస్తుతానికి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అయితే ఈ చైనా పురాణం అనే ఈ కవితలో ఒక చక్కటి మెసెజ్ కూడా దాగి ఉంది. ఎందుకు ఇంకా… మనం కూడా చదివేద్దాం…

ఇటునుం ‘చైనా’
అటునుం ‘చైనా’
ఎటునుం ‘చైనా’
వచ్చి ఉండవచ్చుగాక
ఇకనుం ‘చైనా’ జాగ్రత్తగా ఉంటే మంచిది..
దాని మెడలు వం ‘చైనా’ పంపిద్దాం
ప్రజలకు కాస్త వివరిం ‘చైనా’ చెబుదాం.
వారికి కాస్త మం ‘చైనా’ చేద్దాం
అంతకు మిం ‘చైనా’ సాధిద్దాం….
అంటూ హరీష్ శంకర్ తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా పోస్టు షేర్ చేశారు. ప్రస్తుతానికి ఈ పోస్టు సామాజిక మాంద్యమాల్లో వైరల్ అవుతుంది.