కరోనా బారిన పడ్డ ప్రముఖ నిర్మాత దిల్ రాజ్..!

Tuesday, April 13th, 2021, 01:23:04 AM IST

కరోనా సెకండ్ వేవ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతూ పోతుంది. ఓ పక్క వాక్సిన్ పంపిణీ జరుగుతున్నప్పటికి కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అయితే సామాన్యులతో పాటు ఎంతో మంది ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తుంది.

అయితే ఇటీవల వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్లు, రిలీజ్ అనంతరం జరిగిన ఇతర వేడుకల్లో పాల్గొనగా కరోనా పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలిసి హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. అయితే వకీల్ సాబ్ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇటీవల మెగస్టార్ చిరంజీబి దిల్‌రాజ్‌ను ఇంటికి పిలిచి మరీ అభినందించారు. దీంతో మెగా ఫ్యామిలీలో కూడా మళ్ళీ కరోనా భయం అంటుకుంది. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో దిల్‌రాజ్‌ను కలిసిన డిస్ట్రిబ్యూటర్లలో కూడా టెన్షన్ మొదలయ్యింది.