ప్రముఖ నిర్మాత ‘దిల్ రాజు’ వివాహం ఆమెతోనేనా?

Thursday, February 13th, 2020, 10:33:10 AM IST


దిల్ చిత్రం తో సూపర్ హిట్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు,ఆ తరం సినిమాల నుండి ఇప్పటివరకు పలు హిట్ సినిమాలని నిర్మించారు. స్టార్ హీరోలందరి సినిమాలు నిర్మించిన దిల్ రాజు, మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఈ మధ్య వార్తల్లో నిలిచింది. అయితే దిల్ రాజు తన కుటుంబనికి దగ్గర మనిషి అయిన పెళ్లికాని ముప్పై ఏళ్ల స్త్రీ ని పెళ్లి చేసుకోనున్నాడని తెలుస్తుంది.

డీలా రాజు భార్య దాదాపు రెండేళ్ల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు కుమార్తె సైతం పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఆ కుటుంబానికి, దిల్ రాజు కు ఒక తోడు కావాలని ఆ కుటుంబ సభ్యులు భావిస్తుండటంతో దిల్ రాజు ఆ పెళ్ళికి ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే దిల్ రాజు చేసుకోబోయే స్త్రీ కి సినిమా పరిశ్రమ తో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తుంది. మరి ఈ విషయం లో వాస్తవాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.