రెండు భాషల్లో ధనుష్ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్..?

Thursday, July 9th, 2020, 12:10:59 PM IST

తమిళ్ తో పాటుగా మన తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో బక్క పల్చని హీరో ధనుష్ కూడా ఒకడు. అవ్వడానికి తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు అయినా తనదైన సినిమాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అయితే అతని మావయ్య రజినీ కు “పేట” లాంటి చిత్రంతో మంచి విజయాన్ని అందించిన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక “జగమే తందిరం” అనే చిత్రంలో నటిస్తున్నారు.

ఈ చిత్రాన్నే మన తెలుగులో “జగమే తంత్రం” పేరిట విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు. మోషన్ పోస్టర్ తో మంచి హైప్ ను తెచ్చుకున్న ఈ చిత్రం కూడా ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ గా విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేయగా అందులో ఈ చిత్రం అతి త్వరలోనే విడుదల కానున్నట్లు ఇప్పుడు సమాచారం. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.