ప్రభాస్ 21 కి నాగ్ అశ్విన్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా!?

Wednesday, July 15th, 2020, 03:01:13 AM IST


నాగ్ అశ్విన్ తన మొదటి చిత్రం మహానటి తో నే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం క్రేజీ ప్రాజెక్ట్స్ మాత్రమే చేసుకుంటూ వెళ్తున్న ప్రభాస్, నాగ్ అశ్విన్ కి అవకాశం ఇచ్చారు. అయితే నాగ్ అశ్విన్ తన రెండో సినిమా ను ప్రభాస్ తో చేయడం పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అంతేకాక ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అంశం పై కూడా చాలా క్లారిటీ గా ఉన్నారు. అయితే ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ కావడం, అంతేకాక ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కించాలని భావిస్తున్న తరుణంలో ఈ చిత్రానికి ప్రభాస్ కి జోడీగా హీరోయిన్ కూడా ఒక స్టార్ హీరోయిన్ అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారు.

అయితే బాలీవుడ్ లో దీపిక పదుకొనె తన హవాను కొనసాగిస్తోంది. నటన లో, అందం తో తనకు తానే సాటి అంటూ కొనసాగుతుంది. అయితే తాజాగా చిత్ర యూనిట్ దీపిక ను సంప్రదించి నట్లు తెలుస్తోంది. అంతేకాక దీపిక మహానటి సినిమా పై ఇన్స్టా లో కూడా తన అభిప్రాయం తెలపడం తో అందరూ దీపికానే ఫిక్స్ అని భావిస్తున్నారు. అయితే ప్రభాస్ సినిమా కావడం, భారీ బడ్జెట్ కావడం, పాన్ వరల్డ్ సినిమా కావడం తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే ఈ చిత్రం లో నటించేందుకు గానూ దీపిక భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.