“అల వైకుంఠపురములో” పోస్టర్ లో డేవిడ్ వార్నర్.!

Saturday, August 8th, 2020, 12:35:49 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “అల వైకుంఠపురములో” ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఒక్క చిత్రం ద్వారానే ఎనలేని క్రేజ్ కూడా బన్నీకు ఇంటర్నేషనల్ స్థాయిలో ఏర్పడింది.

ఈ సినిమా నుంచి ప్రతీ ఒక్క అంశమూ సంచలనమే అలా ఇప్పటికే ఎంతో మంది వరకు చేరింది. అయితే ఈ సినిమాకు మరియు ఆస్ట్రేలియన్ డాషింగ్ బాట్స్మెన్ డేవిడ్ వార్నర్ కు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాలోని పాటలకు టిక్ టాక్ లో వార్నర్ చేసిన రచ్చకు మన టాలీవుడ్ లో ఆ మధ్యన ట్రెండింగ్ టాపిక్ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు తనపై ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ ను చూసి సోషల్ మీడియాలో వార్నర్ నవ్వుతున్నారు.

అల వైకుంఠపురములో పోస్టర్స్ లో ఒకటి బన్నీ కోడిని పట్టుకొని తలపాగా తో నడుచుకుంటూ వచ్చే స్టిల్ ఒకటి ఉంటుంది. దానికి కాస్తా వార్నర్ తలను తగిలిచేసారు మన వాళ్ళు. పైగా “డేవిడ్ భాయ్ విల్ బి బ్యాక్” అంటూ క్యాప్షన్ పెట్టడంతో ఇది కాస్తా అలా సర్క్యూలేట్ అయ్యి వార్నర్ వరకు వెళ్ళింది. దీనితో ఆ ఫోటోను చూసి వార్నర్ ఒక్కసారిగా నవ్వేసాడు.