కత్తి మహేష్ అరెస్ట్…మరొకసారి రాముడు పై అనుచిత వ్యాఖ్యలు

Friday, August 14th, 2020, 03:07:36 PM IST

టాలీవుడ్ రివ్యూ రిటైర్, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా లో శ్రీ రాముడు పై మరొకసారి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం నాంపల్లి కోర్టు కి తరలించారు. అయితే కత్తి మహేష్ కి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. అయితే కత్తి మహేష్ పై సెక్షన్ 153 a కమ్యునల్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే కత్తి మహేష్ ఇది వరకే రాముడు పై ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నగర బహిష్కరణ కి గురి అయ్యారు. కత్తి మహేష్ సినిమా ల ద్వారా కంటే ఎక్కువగా వివాదాలతో నే పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన కత్తి మహేష్, అనంతరం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేయడం తో చాలా పాపులర్ అయ్యారు.