బాలయ్య కి బర్త్ డే విషెస్ చెప్పిన యువరాజ్ సింగ్

Thursday, June 10th, 2021, 02:49:29 PM IST


తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖులు, అభిమానులు, సినీ రంగానికి చెందిన వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే బాలయ్య కి ప్రముఖ ఆల్ రౌండర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే నందమూరి బాలకృష్ణ సర్, మీ నటన తో, మానవతా దృక్పథంతో మీరు చేస్తున్న సేవ నిస్వార్థం గా కొనసాగాలని కోరుకుంటున్నా అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాక ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. ఇవే మీకు నా బెస్ట్ విషెస్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే యువరాజ్ సింగ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. అంతేకాక బసవ తారకం లో బాలయ్య తో కలిసిన దిగిన ఫోటోను సైతం యువరాజ్ షేర్ చేయడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.