బిగ్ బాస్ షో వల్ల ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు?

Tuesday, September 8th, 2020, 07:30:03 PM IST

బిగ్ బాస్ రియాలిటీ షో తాజాగా నాల్గవ సీజన్ గ్రాండ్ గా ప్రారంభం అయింది. అయితే ఈ సీజన్ కి సైతం అక్కినేని నాగార్జున వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఈ బిగ్ బాస్ షో పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షో పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ షో వలన ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అంటూ నిర్వాహకులను నారాయణ సూటిగా ప్రశ్నించారు. హిమాలయాల్లో ఉన్న సాంస్కృతిక సంఘాన్ని తీసుకు వచ్చి, మురికి కుంట లో పడేసినట్లు ఉంది అని ఘాటు విమర్శలు చేశారు.

అయితే ఈ షో లో విజయ మల్యా జీవించే భవనాలు ఎంత విలాసం గా ఉన్నాయో, అంతకు మించి బిగ్ బాస్ హౌజ్ ఉంది అని విమర్శించారు. యువతీయువకుల ను తీసుకు వచ్చి ఇందులో పెట్టారు, వంద రోజుల పాటు ఇంట్లోనే పెడతార ట అని తెలిపారు. అంతేకాక ఈ షో లో జరిగిన ఒక సన్నివేశాన్ని వివరించారు. నాగార్జున అభిజిత్ ను పిలిపించి ముగ్గురు హీరోయిన్ ల ఫొటోలను చూపిస్తూ, వివరించమని చెబుతాడు. అయితే అందుకు అభిజిత్ ముద్దు పెట్టుకుంటా, డేటింగ్ చేస్తా, పెళ్లి చేసుకుంటా అంటూ కామెంట్స్ చేస్తాడు. అయితే ఇదేనా మీరిచ్చే సందేశం అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక సాంస్కృతిక దోపిడీ జరుగుతుంది అని, ఇదొక అనైతిక షో అని ప్రజలు దీన్ని ఆదరించ వద్దు అని నారాయణ తెలిపారు.