రివ్యూ రాజా తీన్‌మార్ : కేరాఫ్ సూర్య – అడ్రెస్ సరిగా చెప్పలేదు

Friday, November 10th, 2017, 05:50:40 PM IST


తెరపై కనిపించిన వారు: సందీప్ కిషన్, విక్రాంత్, మెహ్రీన్ ప్రిజాద

కెప్టెన్ ఆఫ్ ‘కేరాఫ్ సూర్య’ : సుశీంథిరన్

మూల కథ :
సూర్య (సందీప్ కిషన్) కుటుంబం, స్నేహితులతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అలాంటి సమయంలోనే సాంబశివుడు అనే రౌడీ మూలాన అతని జీవితంలో కష్టలు మొదలవుతాయి. అతని ప్రాణ స్నేహితుడు మహేష్ (విక్రాంత్) ప్రాణాలకు కూడా అపాయం ఏర్పడుతుంది.

అసలు సాంబశివుడు ఎవరు? అతను సూర్య జీవితంలోకి ఎందుకు ప్రవేశించాడు ? మహేష్ ను ఎందుకు చంపాలనుకున్నాడు ? సాంబ శివుడి నుండి సూర్య తాను స్నేహితుడ్ని ఎలా కాపాడుకున్నాడు ? అనేదే కథ.

విజిల్ పోడు :

–> కథనంలోని ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. వాటి ద్వారా సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి వాటికి మొదటి విజిల్ వేయొచ్చు.

–> దర్శకుడు సుశీంథిరన్ కథ కోసం స్నేహం నైపథ్యంలోని ఎంచుకున్న పాయింట్ బాగుంది. దాన్ని గనుక సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసుంటే ఫలితం మంచి స్థాయిలోనే ఉండేది. కాబట్టి ఆ పాయింట్ కు రెండవ విజిల్ వేయొచ్చు.

–> హీరోగా సందీప్ కిషన్, అతని స్నేహితుడిగా విక్రాంత్ ల నటన బాగుంది. ప్రతి నాయకుడి పాత్రలో హరీష్ ఉత్తమన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కాబట్టి మూడో విజిల్ వారికి వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :
–> కథ కోసం ఎంచుకున్న పాయింట్ బాగున్నా దాన్ని పూర్తిస్థాయి కథగా మలచడంలో దర్శకుడు చాలా వరకు విఫలమయ్యాడు. దీంతో సినిమా మొదటి సగం ఎలాంటి లక్ష్యం లేకుండానే నడిచింది.

–> ఇక కథనంలో ముందుగా ప్రస్తావించినట్టు మూడు సన్నివేశాలు మినహా మిగతా మొత్తం చాలా రొటీన్ గా, స్తబ్దుగా నడిచింది. దీంతో ఎగజిట్మెంట్ కు గురయ్యే సందర్భాలు ఎక్కడా ఎదురుకాలేదు.

–> హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ అనేది సరిగానే పండలేదు. అసలు మెహ్రీన్ కు నటించడానికి ఎక్కడా స్కోప్ దొరకలేదు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..
–> హీరో తన స్నేహితుడ్ని, చెల్లెలిని క్రూరమైన క్రిమినల్ నుండి కాపాడటానికి కేవలం ఒకే ఒక్క పోలీస్ సహాయం తీసుకోవడం విచిత్రంగానే ఉంటుంది.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

–> మిస్టర్ ఏ : సినిమా ఎలా ఉంది ?
–> మిస్టర్ బి : అడ్రెస్ సరిగా చెప్పలేదు.
–> మిస్టర్ ఏ: అడ్రెస్ సరిగా చెప్పకపోవడమేమిటి !
–> మిస్టర్ బి : అదే సినిమాలో కథ సరిగా లేదని అంటున్నా.