హిట్టా లేక ఫట్టా : కేరాఫ్ సూర్య ట్రెండీ టాక్

Friday, November 10th, 2017, 05:31:07 PM IST

టాలీవుడ్ లో కుర్ర హీరోలు ప్రస్తుతం కొత్త తరహా కథలను మాత్రమే ఎంచుకుంటున్నారు. ఎక్కువగా యూత్ ని టార్గెట్ చేస్తూ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అదే తరహాలో గత కొంత కాలంగా తనదైన శైలిలో సినిమాలను చేస్తూ వస్తున్నాడు యువ హీరో సందీప్ కిషన్. అయితే కెరీర్ మొదట్లో విజయాలను అందుకున్నా కూడా ఆ తర్వాత అంతగా ఆకట్టుకోవడం లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని C/O సూర్యా సినిమాతో వచ్చాడు. సుసీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా నటించింది.

ఫ్యామిలీ, క్రైమ్ మరియు సస్పెన్స్ వంటి అంశాలతో ఉన్న ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సూర్య పాత్రలో సందీప్ కిషన్ చాలా బాగా నటించాడు. అంతే కాకుండా అతడి క్యారెక్టరైజేషన్ చాలా నాచురల్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే పకడ్బందీగా ఉండడంతో చిత్రం డీసెంట్ గా అనిపిస్తుంది. కాకపోతే సెకండ్ ఆఫ్ లో దర్శకుడు తడబాటుకు గురైనట్లు అనిపిస్తుంది. ఇక సినిమాలో విలన్ గ్యాంగ్ అలాగే సందీప్ కిషన్ మధ్య మైండ్ గేమ్ తో సాగె ఎపిసోడ్స్ ఆకట్టుకొంటాయి. క్రైమ్ నేపథ్యంలో సాగే సన్నివేశాలని చూపించడంలో, సస్పెన్స్ ని కొనసాగించడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం చొప్పించిన సాంగ్స్, కామెడీ వర్కౌట్ కాలేదు. వీటిని పక్కన పెడితే క్రైమ్ మరియు ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చిన కేరాఫ్ సూర్య చిత్రం పర్వాలేదు అనిపించేవిధంగా ఉంది. మరి సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి.

 

కొంత మెప్పించి కొంత నొప్పించాడు

Reviewed By 123telugu.com |Rating : 2.75/5

ఒక సారి వీక్షించదగిన చిత్రం

Reviewed By chitramala.in |Rating : 2.5/5