రజినీకాంత్ కి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

Thursday, April 1st, 2021, 03:10:57 PM IST

తమిళ సూపర్ స్టార్ హీరో రజినీకాంత్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. రజినీకాంత్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ మేరకు రజినీకాంత్ కి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నటుడు గా దశాబ్దాల పాటు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అని, నేటికీ కూడా దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజినీకాంత్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గొప్ప విషయం అని వ్యాఖ్యానించారు.