కరోనా బాధితులకు సినీ ప్రముఖుల భారీ విరాళం… ?

Wednesday, March 25th, 2020, 01:40:37 AM IST

దేశ వ్యాప్తంగా భయంకరమైన కరోనా వైరస్ సోకిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ మేరకు ఈ భయానకమైన కరోనా వైరస్ ని పూర్తిగా నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కీలకమైన చర్యలను చేపట్టాయి. కాగా ఈనేపథ్యంలో కొందరు సినీ ప్రముఖులు ఈ కరోనా బాధితుల సహాయార్థం భారీ ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. కాగా వీరిలో యువనటుడు నితిన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుసుకొని, కరోనా బాధితులకి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంలో తన మానవీయతను చాటుకున్న నటుడు నితిన్ ని, సీఎం కేసీఆర్ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఈ మేరకు నితిన్ మాట్లాడుతూ…

లాక్ డౌన్ ముగిశాక ఏపీ సీఎం జగన్ గారిని కలుసుకొని రూ.10 లక్షల చెక్కును అందజేయనున్నట్లు తెలిపారు.

ఇకపోతే కరోనా వైరస్ బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేష్ ముఖ్యమంత్రి సహాయనిధి కి ప్రముఖ నిర్మాత ప్రతాప్‌ కోలగట్ల రూ.1 లక్ష విరాళం ప్రకటించారు.

మా మాజీ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ తన స్వంత వ్యవసాయ క్షేత్రంలో పండినటువంటి కూరగాయలను దగ్గరలోని కాలనీ ప్రజలకు అందిస్తున్నామని ప్రకటించారు.

ప్రస్తుతానికి ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుకుంటున్న వారికి అండగా నిలిచేందుకు తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు, దర్శకుడు ఎన్.శంకర్ తెలిపారు.

అంతేకాకుండా ఉగాది నుంచి మా‌ సభ్యులకు 15 రోజుల పాటు బియ్యం, పప్పులు, ఉప్పులు ఇవ్వనున్నట్టు అధికారికంగా ప్రకటించారు… .