టాలీవుడ్ కు పండగొచ్చింది..!

Friday, April 29th, 2016, 05:49:54 PM IST


సమ్మర్ లో కూల్ కూల్ గా ఉంచేందుకు వరసగా సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే, సర్దార్ డిజాస్టర్ అయితే, సరైనోడు యావరేజ్ గా నిలిచింది. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి 150 వ చిత్రం కోసం చిరు అభిమానులతో పాటు, అటు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఎదురు చూసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చిరు 150 వ చిత్రం ఎలాగైతేనేమి ఈరోజు అంగరంగ వైభోగంగా చిరు కుటుంబ సభ్యుల మధ్య ప్రారంభమయింది. చిరు కుటుంబ సభ్యులు అందరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక ఇదిలా ఉంటే, ఈ ఉదయం విశ్వనటుడు కమల్ హాసన్ కొత్త సినిమా శెభాష్ నాయుడు కూడా ప్రారంభమయింది. కమల్ హాసన్, బ్రహ్మానందం మెయిన్ రోల్స్ చేస్తున్న కూడా ఈరోజే ప్రారంభం కావడం విశేషం. మరోవైపు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న కొత్త చిత్రం కూడా ఈరోజే ప్రారంభమయింది. ఈ ప్రారంభోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు. టాలీవుడ్ లో ఇలా మూడు పెద్ద చిత్రాలు ప్రారంభం కావడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఈరోజు తరువాత ముహూర్తాలు లేకపోవడంతోనే ఇలా సినిమాలను ఓపెన్ చేయవలసి వచ్చింది.