సరికొత్త కలయిక : చిరుని డైరెక్ట్ చేయనున్న పరశురామ్…?

Thursday, February 13th, 2020, 01:20:04 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే సైరా చిత్రంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి, వెంటనే ఆయన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు కూడా. కాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకరాడానికి దర్శక నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇకపోతే కొరటాల శివ తో చేసే చిత్రం తరువాత మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన లూసిఫర్‌ చిత్రాన్ని తెలుగులో తెరేక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన తెలుగు రైట్స్ ని రామ్ చరణ్ దక్కించుకున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక లేటెస్ట్ వార్త ఇప్పుడు సామాజిక వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ యువ దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తారని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. గీత గోవిందం చిత్రానికి పరశురామ్ పనితీరు మెచ్చిన చిరంజీవి పిలిచి మరీ ఈ అవకాశాన్ని ఇచ్చారని సమాచారం. కాగా ప్రస్తుతానికి పరశురామ్ నాగచైతన్య సినిమాతో బిజీగా ఉన్నారు. అటు పొతే చిరంజీవి కూడా కొరటాల శివ చిత్రంతో బిజీగా ఉన్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాక పరశురామ్‌ – చిరంజీవి కాంబినేషన్‌ సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.