మూడు సంవత్సరాలైన అదే పవర్.. వకీల్ సాబ్‌పై చిరు ప్రశంసలు..!

Saturday, April 10th, 2021, 04:58:29 PM IST


దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పింక్ రీమేక్ “వకీల్ సాబ్” సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి సూపర్ డూపర్ హిట్ అనిపించుకుంది. దీంతో చాలా మంది సినీ ప్రముఖులు వ‌కీల్ సాబ్ సినిమాకు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. అయితే తాజాగా వకీల్ సాబ్ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించాడు. ఫ్యామిలీతో కలిసి వెళ్ళి తమ్ముడి సినిమా చూసిన మెగస్టార్ ట్విట్టర్ ద్వారా ప్రశంసలు తెలియచేశాడు.

మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత ప‌వ‌న్ కళ్యాణ్ మ‌ళ్లీ అదే వేడి, అదే వాడి. ప్ర‌కాశ్ రాజ్‌తో కోర్టు రూమ్ డ్రామా అద్భుతం. నివేదా థామస్, అంజ‌లి, అనన్య వాళ్ల పాత్ర‌ల్లో జీవించారు. సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్, డీఓపీ వినోద్ ప్రాణం పోశారు. దిల్ రాజుకి, బోనీ క‌పూర్ జీకి, డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్ తో పాటు మిగ‌తా టీమ్ కి నా శుభాకాంక్ష‌లు. అన్నింటికీ మించి మ‌హిళ‌ల‌కి ఇవ్వాల్సిన గౌర‌వాన్ని తెలియ‌జేసే అత్య‌వ‌స‌ర‌మైన చిత్రం. ఈ వ‌కీల్ సాబ్ కేసుల‌నే కాదు.. అంద‌రి మ‌న‌సుల్నీ గెలుస్తాడు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.