యువ హీరో విశ్వంత్‌పై చీటింగ్ కేసు నమోదు..!

Wednesday, January 20th, 2021, 01:13:51 AM IST

టాలీవుడ్ యువ హీరో విశ్వంత్‌పై బంజారాహిల్స్ ఛీటింగ్ కేసు నమోదయ్యింది. తక్కువ ధరకు కార్లను ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేశాడని ఆయనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. సెకండ్ హ్యాండ్ కార్లను తక్కువ ధరకు ఇప్పిస్తానని మోసం చేసినట్టుగా విశ్వంత్‌పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హీరో విశ్వంత్ తనను నమ్మించి మోసం చేశాడని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కాగా బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు హీరో విశ్వంత్‌పై కేసు నమోదు చేశారు. ఇదిలాఉంటే హీరో విశ్వంత్ దిల్‌రాజు నిర్మించిన కేరింత సినిమాతో పాటు ఓ పిట్టకథ మూవీలో కూడా నటించారు.