బుట్ట బొమ్మ సాంగ్ మరో అరుదైన రికార్డు!

Thursday, August 27th, 2020, 02:02:10 AM IST


అల వైకుంఠ పురం లో చిత్రం తో అల్లు అర్జున్ అండ్ టీమ్ కి భారీ విజయం దక్కింది. ఈ చిత్రం మొదటి రోజు నుండి అనేక రికార్డ్ లను క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. ఈ చిత్రం లోని అన్ని పాటలు కూడా సౌత్ ను షేక్ చేశాయి. అయితే బుట్ట బొమ్మ పాటకి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. అయితే ఈ పాట ఇప్పటికే సౌత్ లో రికార్డ్స్ క్రియేట్ చేయగా మరొకసారి ఈ పాట ఒక అరుదైన రికార్డు ను సొంతం చేసుకుంది.

యూ ట్యూబ్ లో ఆల్ టైమ్ టాప్ 100 సాంగ్స్ లో బుట్ట బొమ్మ పాట 7 వ స్థానం సొంతం చేసుకుంది. అయితే అల్లు అర్జున్ అభిమానులు మరొకసారి ఈ ఘనత సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన కథానాయికగా పూజ హెగ్డే నటించిన సంగతి తెలిసిందే. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకి జాని మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందించిన సంగతి అందరికీ తెలిసిందే.