అదిరిపోయే రికార్డ్ సెట్ చేసిన “బుట్టబొమ్మ” సాంగ్..!

Friday, January 8th, 2021, 01:48:46 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. గత సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించిన ఈ సినిమా సాంగ్స్, డ్యాన్స్‌లు కూడా హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ మాత్రం పూటకో రికార్డును క్రియేట్ చేస్తుంది.

రామ జోగయ్యశాస్త్రి రాసిన బుట్టబొమ్మ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, అర్మాన్ మాలిక్ పాడాడు. అయితే తాజాగా ఈ పాట మరో సంచలన రికార్డును అందుకుంది. యూట్యూబ్‌లో ఈ పాటక్ 500 మిలియన్ వ్యూస్ సాధించింది. తెలుగులో ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు పాటగా రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ పాటకు 3.3 మిలియన్ల లైకులు కూడా ఉన్నాయి. ఈ సినిమా విడుదలై మరో 5 రోజుల్లో ఏడాది పూర్తి చేసుకోనున్న ఈ సందర్భంలో ఈ పాట రికార్డ్ క్రియేట్ చేయడం చిత్ర యూనిట్‌కు రెట్టింపు ఉత్సాహం లభించినట్టయింది.