మరో ఆల్ టైం సెన్సేషనల్ రికార్డు అందుకున్న “బుట్ట బొమ్మ”.!

Sunday, August 2nd, 2020, 11:00:57 AM IST

Buttabomma

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ చిత్రం “అల వైకుంఠపురములో”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.అయితే ఈ ఆల్బమ్ కనీ వినీ ఎరుగని రేంజ్ హిట్టయ్యింది.

ముఖ్యంగా ఈ సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్ అయితే ఎల్లలు చెరిపేసి మరీ దుమ్ము రేపింది. ఆడియో పరంగా ఓకె అనిపించినా విజువల్ గా చూసేసరికి మాత్రం భారీ హియ్యయ్యింది. మన తెలుగులోనే కాకుండా మొత్తం దక్షిణాదిలోనే భారీ అయిన వీడియో సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది.

ఇలా ఎన్నో సంచలన రికార్డులు అందుకున్న ఈ పాట ఇప్పుడు ఏకంగా 300 మిలియన్ వ్యూస్ అందుకొని మరో రికార్డు సెట్ చేసింది. అలాగే దీనితో పాటుగా 2.2 మిలియన్ లైక్స్ ను కూడా ఇది అందుకుంది. దీనితో ఈ సాంగ్ మన తెలుగులో మరో ఆల్ టైం రికార్డు ఫీట్ ను అందుకుంది.