హాట్ టాపిక్: బాలయ్య రేంజ్ కి తగ్గట్టుగా సినిమా టైటిల్… బోయపాటి ఫిక్స్ చేస్తారా!?

Sunday, August 30th, 2020, 09:01:55 PM IST

బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కి ఇంకా టైటిల్ పెట్టలేదు. #BB3 అంటూ బోయపాటి ఫస్ట్ లుక్ తో పాటుగా టీజర్ ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కి విపరీత మైన క్రేజ్ వచ్చింది. బాలయ్య మీసకట్టు, గెటప్, మాస్ లుక్ తో మేస్మరైజ్ చేశారు. అయితే ఈ టీజర్ లో ఉన్న డైలాగ్ కి ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. అయితే ఈ చిత్రానికి టైటిల్ వేటలో పడ్డారు చిత్ర యూనిట్. ఈ చిత్రానికి బాలయ్య రేంజ్ కి తగ్గట్టుగా టైటిల్ పెట్టాలి అని బోయపాటి గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ చిత్రానికి “టార్చ్ బేరర్” అనే టైటిల్ ను పెట్టే ఆలోచన లో బోయపాటి శ్రీను ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ చిత్ర టైటిల్ కి అరవింద సమేత వీర రాఘవ రెడ్డి చిత్రం లోని ఒక డైలాగ్ కారణం అని తెలుస్తుంది. ఎన్టీఆర్ ను ఎలివెట్ చేసే టైమ్ లో టార్చ్ బేరర్ అంటూ ఒక డైలాగ్ సినిమాకే హైలైట్ గా ఉంటుంది. బోయపాటి శ్రీను మరియు బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బడా బ్లాక్ బస్టర్ లు గా నిలిచాయి. బాలయ్య ను డిఫెరెంట్ గా, అభిమానులకు నచ్చిన రీతి లో ప్రెసెంట్ చేయడం లో బోయపాటి సక్సెస్ అయ్యారు. అయితే సింహ, లెజెండ్ తరహాలో బ్లాక్ బస్టర్ గా మలిచేందుకు మంచి కథ తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్దం అవుతున్నారు. మరి ఈ టైటిల్ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. దీని పై చిత్ర యూనిట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.